దానాలు చేస్తున్న సాహో భామ

బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ కు క్రేజ్ ఎక్కువే. హిట్స్ ఇవ్వడంతో పాటు కంటెంట్ ఉన్న సినిమాలు నటిస్తుందనే గుర్తింపు ఉంది. ఈ మధ్యన బ్రేక్ పడింది కానీ.. వరుస హిట్స్ కొట్టిన రికార్డు కూడా ఉంది. అయితే.. ఇప్పుడీమెను ఎంతసేపూ సాహో హీరోయిన్ అనే అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ లాంటి స్టార్ తో నటించడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.

ఛారిటీల విషయంలో కూడా శ్రద్ధా కపూర్ కాస్త యాక్టివ్ గానే ఉంటుంది. తన సంపాదనలో ఎంతమేరకు దానాలు చేసేస్తుందో చెప్పలేం కానీ.. జనాలతో డబ్బులు ఇప్పించే కార్యక్రమాల్లో మాత్రం బాగా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడీ బ్యూటీకి కత్తిలాంటి ఐడియా వచ్చింది. అదేమంటే.. తన దగ్గర ఉన్న డ్రెస్సులను దానం చేసిసి.. వాటిని వేలం వేసేయడం ద్వారా వచ్చే డబ్బులను.. జంతు సంరక్షణకు పాటు పడే వారి కోసం ఉపయోగిస్తుందట. స్వయంగా ఓ  కుక్కను పెంచుకుంటున్న తనకు.. జంతువులు అంటే మహా మక్కువ అని లెక్చర్లు దంచుతోంది.

ఆన్ స్క్రీన్.. ఆఫ్ స్క్రీన్ లలో తారలు రకరకాల డ్రెస్సులు వేస్తారనే సంగతి తెలిసిందే. అయితే.. అసలు ధరించని దుస్తులు కూడా చాలానే ఉంటాయట. వీటిని వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బులను జంతు సంరక్షణకు ఉపయోగించబోతున్నానని చెబుతోంది శ్రద్ధ. అంతా బాగానే ఉంది కానీ.. ఇక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చి జనాలు బట్టలు కొంటే.. క్రెడిట్ ఈమె ఖాతాలో వేసుకుంటుందిట. దీనికి బదులు.. సాహోకు అందుకున్న రెమ్యూనరేషన్ దానం ఇవ్వరాదూ బ్యూటీ లాంటి సలహాలు మనం ఇవ్వకూడదండోయ్.

Telugu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *